దివంగత నటి శ్రీదేవికి సంబంధించిన చెన్నై భూ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో శ్రీదేవి భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న 2.7 ఎకరాల భూమిలో తమకూ వాటా ఉందంటూ ఎంసీ చంద్రశేఖరన్ పిల్లలు ఎంసీ శివగామి, ఎంసీ నటరాజన్ పిటిషన్ దాఖలు చేశారు.
1988లో శ్రీదేవికి విక్రయించిన ఈ ఆస్తిపై హక్కులు ఉన్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. గతంలో ఈ వివాదంపై మద్రాస్ హైకోర్టు విచారణ జరిపి, పిటిషన్ గడువు ముగిసిందని పేర్కొంటూ దావాను కొట్టివేసింది. దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణ వరకు ఆ భూమిపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అలాగే వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశాన్ని పరిశీలించాలని సూచించింది. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 18కు వాయిదా వేసింది.
కపూర్ కుటుంబం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ, ఆస్తి 1988లోనే విక్రయించబడిందని, పిటిషన్ ఆలస్యంగా దాఖలైందని పేర్కొన్నారు.
భూవివాదంలో శ్రీదేవి కుటుంబానికి సుప్రీంకోర్టు నోటీసులు
0
Published: 📅
Reported by: 🖊
Sarika Sk