హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణించే వారి కోసం ఆర్టీసీ నడుపుతున్న పుష్పక్ బస్సులకు ప్రయాణికుల ఆదరణ తగ్గుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎయిర్‌పోర్టు రూట్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా పడిపోయింది.
మియాపూర్ ఎక్స్‌రోడ్ నుంచి రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టుకు నడిచే పుష్పక్ బస్సుల్లో గతేడాది ఆగస్టులో 92 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అయితే ఈ ఏడాది ఆగస్టులో అది 53 శాతానికి తగ్గింది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గడం, ఇతర దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారి సంఖ్య తగ్గడం వల్ల ఎయిర్‌పోర్టు బస్సులపై ప్రభావం పడిందని అధికారులు చెబుతున్నారు.
విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం కెనడా, అమెరికా, యూకే వంటి దేశాలు స్టూడెంట్ వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో ఈ మార్పు వచ్చిందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ 57 పుష్పక్ బస్సులను ఐదు రూట్లలో ప్రతిరోజూ 432 ట్రిప్పులు నడుపుతోంది. రోజుకు సుమారు 8,700 మంది ప్రయాణికులు ఈ సేవలను వినియోగిస్తున్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే బస్సుల కంటే, అక్కడి నుంచి నగరానికి వచ్చే బస్సుల్లోనే ఎక్కువ మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఆర్టీసీ ఆదాయం కూడా తగ్గింది. మియాపూర్ ఎక్స్‌రోడ్ నుంచి ఎయిర్‌పోర్టు రూట్‌లో గతేడాది ఆగస్టులో రూ.1.68 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది ఆగస్టులో అది రూ.1.07 కోట్లకు తగ్గింది. లింగంపల్లి, జేబీఎస్ ఎయిర్‌పోర్టు రూట్లలో కూడా ఆక్యుపెన్సీ శాతం తగ్గింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో పుష్పక్ బస్సులను నడిపే అంశాన్ని ఆర్టీసీ పరిశీలిస్తోంది
పుష్పక్ బస్సులకు తగ్గిన ఆదరణ.. ఎయిర్‌పోర్టు ప్రయాణికుల సంఖ్యలో భారీ పతనం
0
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk