ఏపీ లిక్కర్ రవాణా స్కాం కేసు మరోసారి చర్చకు వచ్చింది. ఈ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పీటీ వారెంట్‌పై విజయవాడ కోర్టుకు తీసుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) ద్వారా జరిగిన మద్యం రవాణా టెండర్లలో అక్రమాలు, మనీలాండరింగ్ జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది.
ఈడీ నివేదిక ప్రకారం, నిబంధనల ప్రకారం కిలోమీటరుకు రూ.13 చెల్లించాల్సి ఉండగా, టెండర్ నిబంధనల్లో మార్పులు చేసి కిలోమీటరుకు రూ.35 వరకు చెల్లించారని, దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.195.33 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది.
కారుమూరి నాగేశ్వరరావు పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తన అధికారాన్ని ఉపయోగించి కుమారుడు, వ్యాపార భాగస్వాములకు మద్యం రవాణా సబ్‌కాంట్రాక్టులు దక్కేలా చేశారని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో కారుమూరి కుమారుడు సునీల్ కుమార్, ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, డిజిటల్ నెట్‌వర్క్స్ అధినేత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిలను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు సమాచారం.
ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో అక్రమ లావాదేవీలు జరిగాయని ఈడీ పేర్కొంది. అలాగే కారుమూరి కుటుంబానికి సంబంధించిన సుమారు రూ.87.7 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు వెల్లడించింది.
ఏపీ లిక్కర్ రవాణా స్కాం: పీటీ వారెంట్‌పై విజయవాడ కోర్టుకు కారుమూరి
0
Published: 📅
Reported by: 🖊
Banu Prakash