ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా వచ్చిన శుభాకాంక్షలు, ఆశీస్సులపై స్పందించారు. ప్రజల నుంచి లభిస్తున్న ప్రేమ, ఆశీర్వాదాలు దేశసేవ పట్ల తన నిబద్ధతను మరింత పెంచుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నిర్వహిస్తున్న ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమంపై మాట్లాడుతూ ప్రజల మద్దతు తన సంకల్పాన్ని మరింత బలపరుస్తుందని తెలిపారు.
మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని గాయని స్నేహా శంకర్, కళాకారుడు అమన్ పంత్ రూపొందించిన ప్రత్యేక గీతం ‘ఆశీర్వాద్ కా దియా’ విడుదలైంది. ఈ పాటను మోదీ జన్మదినంతో పాటు ఆయన 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని గుర్తుచేస్తూ అంకితం చేసినట్లు సమాచారం.
ఇక మోదీ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమం నిర్వహించాలని బీజేపీ పిలుపునిచ్చింది. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ఇళ్లలో దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలియజేయాలని పార్టీ నేతలు కోరారు. అలాగే ‘సేవా సంకల్ప్ అభియాన్’ పేరుతో నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రక్తదాన శిబిరాలు, పరిశుభ్రత కార్యక్రమాలు, ప్రదర్శనలు, సదస్సులు, ప్రజా సంబంధ కార్యక్రమాలు ఇందులో భాగంగా ఉంటాయని వెల్లడించారు.
ప్రతీ ఆశీర్వాదం నా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది: ప్రధాని మోదీ
0
Published: 📅
Reported by: 🖊
Kanakadri