ఇంటర్నెట్ డెస్క్: రష్యాపై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా కాంగ్రెస్ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రతినిధుల సభలో ఈ బిల్లు 262–159 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ప్రస్తుతం ఈ బిల్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కోసం వైట్‌హౌస్‌కు చేరింది. అంతకుముందు సెనెట్‌లోనూ ఈ బిల్లు 86–11 ఓట్లతో ఆమోదం పొందింది.
రష్యా ఉక్రెయిన్‌పై కొనసాగిస్తున్న యుద్ధానికి ఆర్థికంగా మద్దతు అందించే మార్గాలను తగ్గించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యంగా పేర్కొనబడింది. ఈ బిల్లులో రష్యా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగాలను లక్ష్యంగా చేసుకునే నిబంధనలు ఉన్నాయి. రష్యా బ్యాంకులు, ఇంధన రంగం, రక్షణ రంగంతో పాటు చమురు రవాణాకు ఉపయోగిస్తున్న నౌకలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
ఈ బిల్లులోని ముఖ్యమైన అంశాల్లో ఒకటి.. రష్యా నుంచి చమురు, సహజవాయువును కొనుగోలు చేసే దేశాలపై అదనపు సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఇవ్వడం. రష్యా ఇంధనాన్ని ఎక్కువగా కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉంది. ఈ జాబితాలో భారత్, చైనా కూడా ఉండే అవకాశం ఉందని కథనం పేర్కొంది.
సెనెట్, ప్రతినిధుల సభ రెండింటిలోనూ బిల్లు ఆమోదం పొందడంతో ఇప్పుడు అధ్యక్షుడి సంతకం తదుపరి దశగా ఉంది. ఈ బిల్లుపై సంతకం చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించినట్లు సమాచారం. భారత్, చైనా విషయంలో ఈ అధికారాన్ని ఎలా వినియోగిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
రష్యాపై భారీ ఆంక్షల బిల్లుకు ఆమోదం.. భారత్, చైనాపై 100 శాతం సుంకాలకు ఛాన్స్
5
Published: 📅
Reported by: 🖊
Banu Prakash