అమరావతి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలువురు నాయకులు ఎక్స్ వేదికగా మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు ప్రధాని నాయకత్వాన్ని ప్రశంసించారు.
సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడం నుంచి దేశ ప్రధానిగా కొనసాగుతున్న వరకు ఆయన ప్రజాసేవ ప్రస్థానాన్ని ప్రస్తావించారు. మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ భారత అభివృద్ధి ప్రయాణానికి ఊతమిచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘సేవ, సంకల్పం, సుశాసన్’ అనే దార్శనికత కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిస్తోందని తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రయాణం, ప్రజాసేవ పట్ల నిబద్ధతను ప్రస్తావిస్తూ దేశ అభివృద్ధి, స్వావలంబన, జాతీయ భద్రత వంటి అంశాలను తన సందేశంలో పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా, యూపీఐ, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కూడా మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సేవ, సుపరిపాలన, ప్రజాసంక్షేమం ఆధారంగా దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తన సందేశంలో పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు
1
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan