పాన్ మసాలా కంపెనీ ప్రకటనలో నటించిన బాలీవుడ్ నటులకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే స్పందిస్తూ, ప్రముఖులు అయినప్పటికీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిగా పరిగణిస్తామని పేర్కొన్నారు.
షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్, టైగర్ ష్రాఫ్‌లు ఓ పాన్ మసాలా కంపెనీ ప్రకటనలో నటించినందుకు ఈ నోటీసులు అందుకున్నట్లు సమాచారం. ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తిని ప్రోత్సహించడంపై ఎఫ్‌డీఏ చర్యలు తీసుకుంటోందని తుకారాం ముండే తెలిపారు. ముగ్గురు నటుల్లో ఇద్దరు మాత్రమే షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చారని, మరొకరు ఇంకా స్పందించలేదని ఆయన వెల్లడించారు.
పాన్ మసాలా ఉత్పత్తుల ప్రచారంపై మహారాష్ట్రలో నిషేధం ఉన్నందున చర్యలు తీసుకున్నామని ఎఫ్‌డీఏ కమిషనర్ తెలిపారు. నోటీసులకు 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని గడువు ఇచ్చినట్లు చెప్పారు. ఉత్పత్తిని ప్రోత్సహించిన వ్యక్తులకు కూడా బాధ్యత ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
కంపెనీ ఉత్పత్తిని ప్రచారం చేయడం కేవలం కంపెనీ బాధ్యత మాత్రమే కాదని, ఆ ఉత్పత్తిని ఎండార్స్ చేసిన వారిపైనా బాధ్యత ఉంటుందని తుకారాం ముండే వివరించారు. ఎఫ్‌డీఏ చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
పాన్ మసాలా ప్రకటనపై నటులకు నోటీసులు.. చట్టాన్ని ఉల్లంఘించిన వారిగానే చూస్తా: తుకారాం ముండే
0
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk