గూగుల్‌కు చెందిన జెమినీ ఏఐ సైబర్ సెక్యూరిటీ పరీక్షలో సంచలన ఫలితాలు నమోదు చేసింది. వాస్తవంగా ఉన్న మూడు కంపెనీల వ్యవస్థలను జెమినీ ఏఐ యాక్సెస్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఒక సంస్థకు చెందిన పాస్‌వర్డ్‌ను కూడా సరైన విధంగా అంచనా వేసి ఆ వ్యవస్థలోకి ప్రవేశించింది. ఈ పరీక్షను 2026 మేలో ‘ఇర్రెగ్యులర్’ అనే స్వతంత్ర ఏఐ సెక్యూరిటీ టెస్టింగ్ సంస్థ నిర్వహించింది.
పరీక్షలో జెమినీకి ఒక కల్పిత సంస్థకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే బాధ్యత అప్పగించారు. అయితే పరీక్షలో ఉపయోగించిన సంస్థ పేరుతో నిజమైన కంపెనీ కూడా ఉండటంతో, జెమినీ ఆ కంపెనీల సేవలను యాక్సెస్ చేసింది. ఒక కంపెనీకి సంబంధించిన పాస్‌వర్డ్‌ను ఊహించి సిస్టమ్‌లోకి ప్రవేశించగా, మరో రెండు కంపెనీల విషయంలో ఇంటర్నెట్‌లో బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఉపయోగించింది.
ఈ మూడు కంపెనీలు నిజంగానే ఉన్నవని గుర్తించిన తర్వాత జెమినీ మరింత ముందుకు వెళ్లలేదని సమాచారం. ప్రభావితమైన కంపెనీల పేర్లను గూగుల్ వెల్లడించలేదు. అయితే ఆయా సంస్థలకు సమాచారం అందించి, పరీక్షా విధానాల్లో మార్పులు చేసినట్లు గూగుల్ సెక్యూరిటీ ఇంజినీరింగ్ విభాగం తెలిపింది.
ఏఐ ఏజెంట్లకు ఇంటర్నెట్, కంప్యూటర్ వ్యవస్థలు, డిజిటల్ సాధనాలకు ఎక్కువ స్వతంత్ర యాక్సెస్ లభిస్తున్న నేపథ్యంలో భద్రతా నియమాలు, నియంత్రణ వ్యవస్థలు మరింత బలంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటనలు వెల్లడిస్తున్నాయి.
సైబర్ సెక్యూరిటీ పరీక్షలో గూగుల్ జెమినీ సంచలనం.. మూడు కంపెనీల సిస్టమ్స్‌ను యాక్సెస్ చేసి, పాస్‌వర్డ్‌లు కూడా అంచనా
7
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan