హర్యానాలోని సోనిపట్‌లో ఆరు నెలల శిశువుపై పిట్ బుల్ శునకం దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సోనిపట్‌లోని సిక్కా కాలనీలో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
చిన్నారి బంధువు బేబీని తీసుకుని వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ పిట్ బుల్ శునకం వారి వద్దకు దూసుకొచ్చింది. కుక్క దాడి చేయడంతో చిన్నారిని కాపాడేందుకు ఆ మహిళ ప్రయత్నించింది. కానీ ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. కుక్క చిన్నారిని నోటితో పట్టుకుని ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో శిశువు నేలపై పడిపోయింది. ఆ తర్వాత కూడా కుక్క చిన్నారిని రోడ్డుపై లాక్కెళ్లింది.
అక్కడ ఉన్న స్థానికులు చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ కుక్క వదలలేదు. చివరకు తీవ్ర గాయాలతో ఉన్న శిశువును రోహ్‌తక్‌లోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం.
ఈ ఘటనతో సిక్కా కాలనీ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పిట్ బుల్ వంటి కుక్కలను పెంచే విషయంలో యజమానుల బాధ్యత, భద్రతా చర్యలపై చర్చ జరుగుతోంది. కుక్క యజమాని నిర్లక్ష్యంపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గతంలో కూడా పిట్ బుల్ దాడులకు సంబంధించిన ఘటనలు నమోదైనట్లు సమాచారం.
దారుణం.. ఆరు నెలల శిశువుపై పిట్ బుల్ దాడి
5
Published: 📅
Reported by: 🖊
Kanakadri