ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (ఐఐటీ బాంబే)లో విద్యార్థి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. పరీక్ష సమయంలో ఫోన్ ఉపయోగిస్తూ విద్యార్థి పట్టుబడిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ఫోన్‌లో ప్రశ్నపత్రాన్ని చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేసి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించినట్లు ఐఐటీ బాంబే అధికారులు తెలిపారు.
విద్యార్థికి ఇన్‌స్ట్రక్టర్, విభాగాధిపతి కౌన్సెలింగ్ ఇచ్చారని, ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని ఐఐటీ బాంబే ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటన విద్యార్థి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపదని భరోసా ఇచ్చినప్పటికీ, అనంతరం విద్యార్థి హాస్టల్ గదికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థి మృతిపై ఐఐటీ బాంబే తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అయితే ఈ ఘటనపై పలువురు విద్యార్థులు క్యాంపస్‌లో నిరసన చేపట్టారు. యాజమాన్యం నుంచి జవాబుదారీతనం, పారదర్శకత, స్పష్టమైన వివరణ కోరారు. క్యాంపస్‌లో విద్యార్థుల మరణాలకు సంబంధించిన కారణాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు క్యాంపస్‌లో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు భద్రత పెంచినట్లు సమాచారం. విద్యార్థులతో ఐఐటీ బాంబే యాజమాన్యం చర్చలు జరిపి, మృతిచెందిన విద్యార్థికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చింది.
ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. పరీక్షలో ఫోన్ ఘటనపై క్యాంపస్‌లో నిరసనలు
8
Published: 📅
Reported by: 🖊
Venkata Dodla