అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారం వైట్‌హౌస్‌లో నిర్వహించనున్న డిన్నర్ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో పాటు ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీల అధినేతలు పాల్గొననున్నారు. ఎన్‌విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగంలో అమెరికా, చైనా మధ్య పోటీ పెరుగుతోంది. అత్యాధునిక ఏఐ అభివృద్ధికి అవసరమైన అధునాతన చిప్‌ల సరఫరాపై అమెరికా ఆంక్షలు విధించడం ద్వారా చైనా పురోగతిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఎన్‌విడియా తయారు చేసే అధిక సామర్థ్యం కలిగిన సెమీకండక్టర్ చిప్‌ల విషయంలో అమెరికా జాగ్రత్తలు తీసుకుంటోంది.
అయితే ఏఐ రంగంలో పోటీ కొనసాగుతున్నప్పటికీ, ట్రంప్-జిన్‌పింగ్ సమావేశంలో ఈ సాంకేతిక రంగానికి సంబంధించిన కొన్ని అంశాలపై ఒప్పందం కుదిరే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా, చైనా మధ్య జరిగే ఈ చర్చల్లో ఏఐ కీలక అంశంగా మారనుందని సమాచారం.
ట్రంప్-జిన్‌పింగ్ విందుకు టాప్ టెక్ దిగ్గజాలు.. ఏఐ పోటీపై ఆసక్తి
7
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk