యెమెన్‌లో హౌతీలు, సౌదీ అరేబియా మధ్య కొనసాగుతున్న ఘర్షణలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. గత 24 గంటల్లో తమ ఆధీనంలోని పలు ప్రాంతాలపై సౌదీ అరేబియా 26 సార్లు దాడులు చేసిందని హౌతీలు ప్రకటించారు. గత వారం రోజుల్లో సౌదీ దాడులు 300 ప్రాంతాల్లో జరిగాయని వారు పేర్కొన్నారు.
యెమెన్ రెడ్ సీ తీరంలో ఉన్న బాబ్-అల్-మండేబ్ జలసంధి విషయంలో కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ జలసంధిని హౌతీలు తమ నియంత్రణలోకి తీసుకున్నారని, సౌదీ నౌకలు మినహా ఇతర దేశాల నౌకలు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నాయని వారు చెబుతున్నారు. జులై నుంచి ఈ మార్గం ద్వారా సౌదీ అరేబియా ఎగుమతులు తగ్గినట్లు సమాచారం.
2014లో హౌతీలు యెమెన్ రాజధాని సనాను ఆక్రమించడంతో అంతర్యుద్ధం ప్రారంభమైంది. 2015లో హౌతీలకు వ్యతిరేకంగా సౌదీ అరేబియా సైనిక చర్యలు చేపట్టింది. అనంతరం ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు కొనసాగాయి. 2022లో ఉద్రిక్తతలు కొంత తగ్గినప్పటికీ, ఈ ఏడాది జులైలో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి.
ఐక్యరాజ్యసమితి ప్రకారం, తాజా ఘర్షణల కారణంగా 1.12 లక్షల మంది యెమెన్ ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరో 3 వేల మంది సముద్ర మార్గం ద్వారా వలస వెళ్లినట్లు వెల్లడించింది. అలాగే లక్షలాది మంది ప్రజలు ఆహార కొరతతో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.
24 గంటల్లో సౌదీ అరేబియా 26 దాడులు చేసింది: హౌతీల ఆరోపణ
0
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk