అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మంగళవారం రాత్రి అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగినట్లు ఇరాన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలు మధ్యప్రాచ్య ప్రాంతంలో తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి.
ఇరాన్ ప్రత్యేక సైనిక దళం ఐఆర్‌జీసీ ఇరాక్, జోర్డాన్‌పై దాడులు చేసినట్లు సమాచారం. అలాగే కువైట్, బహ్రెయిన్ ప్రాంతాల్లో కూడా పేలుళ్లు సంభవించినట్లు నివేదికలు వెల్లడించాయి. సిరిక్ ప్రాంతంలో అమెరికా దాడి కారణంగా ఓ పెళ్లింట విషాదం చోటుచేసుకుందని ఇరాన్ మీడియా పేర్కొంది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా నలుగురు మృతి చెందారని, మరో 50 మంది గాయపడ్డారని తెలిపింది.
తమపై దాడులకు పాల్పడుతున్న అమెరికా చివరకు పశ్చాత్తాపం చెందక తప్పదని ఇరాన్ సైనిక దళం ఐఆర్‌జీసీ హెచ్చరించింది. మరోవైపు హోర్ముజ్‌లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేసే ప్రయత్నం చేయడంతోనే తాము చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.
ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్‌ను అడ్డుకున్నామని జోర్డాన్, కువైట్ ప్రకటించాయి. జోర్డాన్ తమ వైపు వస్తున్న 13 బాలిస్టిక్ మిసైల్స్‌ను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇరాన్ దాడుల వల్ల తమ దేశంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది.
అమెరికా దాడుల్లో చిన్నారి మరణించిందన్న వార్తలపై యూఎస్ సెంట్రల్ కమాండ్ స్పందిస్తూ, సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకోవడం తమ విధానం కాదని స్పష్టం చేసింది.
అమెరికా దాడులతో పెళ్లింట విషాదం.. ఇరాన్ ప్రతీకార దాడులతో ఉద్రిక్తత
16
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan