హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు నెంబర్ 10లో నివసిస్తున్న రాజస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త నీల్ కౌర్ ఇంట్లో దుండగుడు చొరబడి విలువైన వజ్రాభరణాలు, బంగారు నగలు ఎత్తుకెళ్లాడు.
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. మొత్తం 10 తులాలకు పైగా బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు తెలిపారు. చోరీకి గురైన వాటిలో ఎమరాల్డ్ ఉంగరం, బ్రాస్లెట్లు, నెక్లెస్‌లు, చెవి కమ్మలు తదితర ఆభరణాలు ఉన్నట్లు వివరించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దుండగుడి కదలికలను పోలీసులు గుర్తించారు. కిటికీ గ్రిల్స్ తొలగించి వెనుక భాగం నుంచి ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు.
చోరీకి ముందు అదే దుండగుడు మరో రెండు ఇళ్లలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆయా ఇళ్ల యజమానులు మేల్కొని ఉండటంతో అక్కడి నుంచి వెనక్కి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించారు.
వ్యాపారవేత్త ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన దుండగుడు ఆ ఇంటినే లక్ష్యంగా ఎంచుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.
జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ.. వ్యాపారవేత్త ఇంట్లో వజ్రాభరణాలు మాయం
14
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk