గొల్లగుప్ప గ్రామంలో క్లోరో క్వీన్ మాత్రలు వికటించిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజశేఖర్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన వెల్లడించారు.
ఈ ఘటనలో ఏడేళ్ల బాలిక జమున మృతి చెందింది. వాంతులతో ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికే చిన్నారి మృతి చెందినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. చిన్నారి మరణానికి గల కారణాలను నిర్ధారించేందుకు పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారనుందని పేర్కొన్నారు.
క్లోరో క్వీన్ మాత్రలు కొంతమందిలో ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉందని, ముఖ్యంగా కార్డియాక్ సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. చిన్నారి జమున పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు దృష్టి సారించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో కోలుకున్నవారిని బుధవారం సాయంత్రానికి డిశ్చార్జ్ చేయనున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు పోస్టుమార్టం నివేదిక, తదుపరి విచారణ ద్వారా వెలుగులోకి రానున్నాయి.
గొల్లగుప్ప ఘటనలో చిన్నారి మృతి.. పోస్ట్‌మార్టం రిపోర్టుపైనే ఆశలు
20
Published: 📅
Reported by: 🖊
Banu Prakash