తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌ను 2029 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ముందుకు తీసుకురావాలనే డిమాండ్ ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీవీకే కార్యకర్తలు, నేతల నుంచి వినిపిస్తున్న ‘విజయ్ ఫర్ పీఎం’ నినాదం కారణంగా టీవీకే మరియు కాంగ్రెస్ మధ్య విభేదాలు మొదలయ్యాయనే వార్తలు వస్తున్నాయి.
2029 ఎన్నికల కోసం విజయ్‌ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేస్తూ తమిళనాడులోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఈ ప్రచారం క్రమంగా ఊపందుకుంటుండగా, ప్రతిపక్ష కూటమి తరఫున కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ఉండే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. దీంతో విజయ్ వర్సెస్ రాహుల్ గాంధీ అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ముందుకు తీసుకురావాలన్న ప్రచారంపై తమిళనాడు కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్ సహా కొన్ని మిత్రపక్షాల మద్దతు కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి నినాదాలు రెండు పార్టీల సంబంధాలను మరింత క్లిష్టంగా మార్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి.
అయితే కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత తారహై కుత్‌బర్ట్ మాత్రం టీవీకే-కాంగ్రెస్ మధ్య తీవ్రమైన విభేదాలు లేవని స్పష్టం చేశారు. ‘విజయ్ ఫర్ పీఎం’ అనేది పార్టీ అధికారిక నిర్ణయం కాదని, కార్యకర్తల నుంచి వచ్చిన నినాదమేనని తెలిపారు.
విజయ్ ఫర్ పీఎం నినాదం.. టీవీకే-కాంగ్రెస్ మధ్య పెరుగుతున్న రాజకీయ దూరం?
0
Published: 📅
Reported by: 🖊
Banu Prakash