అమెరికాలోని ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్కులో ఊహించని ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. ఆకస్మిక వరదల కారణంగా పార్కులోని బ్రైట్ ఏంజెల్ క్రీక్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. శనివారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడంతో 20 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. భారీ ప్రవాహం ధాటికి పాదచారుల వంతెనలు, పెద్ద బండరాళ్లు, లోహ నిర్మాణాలు, ఇతర శిథిలాలు కొలరాడో నదిలోకి కొట్టుకుపోయాయి.
వరద ప్రవాహం కారణంగా బ్రైట్ ఏంజెల్ క్రీక్ స్వరూపమే పూర్తిగా మారిపోయినట్లు వీడియోల్లో కనిపిస్తోంది. గల్లంతైన వారి ఆచూకీ కోసం అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, వరద ప్రభావిత ప్రాంతంలోని ఫాంటమ్ రాంచ్‌లో ఉన్న 62 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలపై అధికారిక సమాచారం వెలువడలేదు.
అయితే పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగా మరిన్ని ఆకస్మిక వరదలు, శిథిలాల ప్రవాహాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బ్రైట్ ఏంజెల్ క్యాంప్‌గ్రౌండ్, ఫాంటమ్ రాంచ్, నార్త్ కైబాబ్ ట్రైల్‌లోని కొన్ని ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేశారు. కొలరాడో నదిపై రాఫ్టింగ్ యాత్రలను కూడా నిలిపివేశారు. నష్టం ఎంతమేర జరిగిందో అంచనా వేసే పనులు కొనసాగుతున్నాయి.
అమెరికాలో వరద బీభత్సం.. గ్రాండ్ కాన్యన్‌లో 20 మందికి పైగా గల్లంతు
2
Published: 📅
Reported by: 🖊
Banu Prakash