తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడవచ్చని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
హైదరాబాద్ నగరానికి కూడా వర్ష సూచన ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఉన్న సమయంలో బయటకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
2
Published: 📅
Reported by: 🖊
Sarika Sk