అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. ఇంటర్ మయామి తరఫున మాంట్రియల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా నాలుగు గోల్స్ చేసి జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. మెస్సి అద్భుత ప్రదర్శనతో ఇంటర్ మయామి 7-1తో మాంట్రియల్‌ను చిత్తు చేసింది. వరుసగా ఐదు మ్యాచ్‌లుగా విజయానికి దూరంగా ఉన్న మయామికి ఈ గెలుపు భారీ ఊరటనిచ్చింది. ప్రపంచకప్ తర్వాత సీజన్ పునఃప్రారంభమైనప్పటి నుంచి మయామి ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చింది.
20వ నిమిషంలో కాసెమిరో హెడ్డర్‌తో గోల్ చేసి మయామికి ఆధిక్యం అందించాడు. 37వ నిమిషంలో ఫాబియన్ హెర్బర్స్ గోల్‌తో మాంట్రియల్ 1-1తో సమం చేసింది. అయితే మూడు నిమిషాలకే మెస్సి తన ప్రతాపం చూపించాడు. బాక్స్ అంచు నుంచి కొట్టిన అద్భుతమైన లో కర్లింగ్ ఫ్రీకిక్ నేరుగా నెట్‌లోకి దూసుకెళ్లింది.
రెండో అర్ధభాగం ప్రారంభమైన కొద్దిసేపటికే మెస్సి మరో గోల్ చేసి మయామి ఆధిక్యాన్ని 3-1కు పెంచాడు. అనంతరం మాజీ బార్సిలోనా సహచరుడు లూయిస్ సువారెజ్‌కు అద్భుతమైన పాస్ అందించగా, అతను గోల్‌గా మలిచాడు. 83వ నిమిషంలో గోల్‌కీపర్‌పై నుంచి తెలివిగా బంతిని లాబ్ చేసి మెస్సి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. 89వ నిమిషంలో అలెక్స్ షా గోల్ చేశాడు. అదనపు సమయంలో మెస్సి మరో ఫ్రీకిక్ గోల్‌తో నాలుగు గోల్స్ పూర్తి చేశాడు. ఈ విజయంతో మయామి ఈస్టర్న్ కాన్ఫరెన్స్‌లో రెండో స్థానానికి చేరుకుంది.
అదరగొట్టిన మెస్సి.. ఒకే మ్యాచ్‌లో నాలుగు గోల్స్.. మాంట్రియల్‌పై మయామి ఘన విజయం
1
Published: 📅
Reported by: 🖊
Kanakadri