రాయలసీమ అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. మొత్తం రూ.8,022 కోట్లతో రాయలసీమలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో రూ.4,523 కోట్లతో 23 వేలకు పైగా రోడ్ల పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే 5,238 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయింది.
రాయలసీమలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా జల సంరక్షణ చర్యలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. నీటి కుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణం ద్వారా భూగర్భ జలాలను పెంచేందుకు చర్యలు చేపట్టారు. ఈ చర్యల ఫలితంగా 50 వేలకు పైగా ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగినట్లు సమాచారం. ఉపాధి హామీ పథకం ద్వారా 62 వేల ఎకరాల్లో ఉద్యాన సాగును చేపట్టారు. దీని ద్వారా 28 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
పాడి రైతులకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గోకులాలు, నీటి తొట్టెల నిర్మాణం చేపట్టి పశుపోషణకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నారు. సీమ దాహార్తిని తీర్చేందుకు జేజేఎం-అమరజీవి జలధారాల పనులు కూడా సిద్ధమవుతున్నాయి. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచేందుకు 13 నగర వనాలను అభివృద్ధి చేయనున్నారు. రోడ్లు, నీరు, వ్యవసాయం, పశుపోషణ, పచ్చదనం వంటి పలు రంగాలను కలిపి రాయలసీమ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
:::
రాయలసీమ అభివృద్ధిపై పవన్ స్పెషల్ ఫోకస్.. రూ.8,022 కోట్లతో ప్రత్యేక కార్యాచరణ
6
Published: 📅
Reported by: 🖊
Sarika Sk