ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి రద్దు చేశారనే కోపంతో ఓ వ్యక్తి తన మాజీ నిశ్చితార్థితురాలిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన సోదరిపైనా యాసిడ్ పోశాడు. ఈ ఘటన ఆవాస్ వికాస్ కాలనీలో చోటుచేసుకుంది. నిందితుడిని హర్ష్ భాటిగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
హర్ష్ భాటికి ఇటీవల ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే అతడికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని తెలుసుకున్న తర్వాత యువతి కుటుంబం పెళ్లిని రద్దు చేసింది. ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహానికి గురైన హర్ష్ భాటి, శనివారం రాత్రి యాసిడ్ బాటిల్‌తో యువతి ఇంటికి వెళ్లాడు. తలుపు తీయగానే యువతిపై యాసిడ్ పోశాడు. ఈ దాడిని అడ్డుకునేందుకు ఆమె సోదరి ప్రయత్నించడంతో ఆమెపైనా యాసిడ్ దాడి చేశాడు.
ఈ ఘటనలో ఇద్దరు సోదరీమణులు తీవ్రంగా గాయపడ్డారు. వారి కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. గాయపడిన ఇద్దరు మహిళలను కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
బాధితుల కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి రద్దు చేసిన కారణంతో ఇలాంటి హింసాత్మక చర్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. ఘటనపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
:::
పెళ్లి రద్దు చేశారని దారుణం.. యువతి, సోదరిపై యాసిడ్ దాడి
7
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk