స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు.సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన పవన్ కల్యాణ్.. ఖుదీరామ్ బోస్ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలను గుర్తుచేశారు.కేవలం 18 ఏళ్ల వయసులోనే ఖుదీరామ్ బోస్ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేశారని పవన్ పేర్కొన్నారు.స్వతంత్ర భారతాన్ని చూడలేకపోయినా.. ఆయన చేసిన త్యాగం స్వాతంత్ర్య ఉద్యమానికి బలమైన పునాదిగా నిలిచిందని అన్నారు.ఖుదీరామ్ బోస్ ధైర్యం, దేశభక్తి నేటి యువతకు కూడా ఆదర్శమని పవన్ కల్యాణ్ తెలిపారు.మాతృభూమిపై ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఆయన జీవితం చాటిచెబుతోందన్నారు. దేశ యువతలో ధైర్యం, అంకితభావాన్ని ఖుదీరామ్ బోస్ పేరు ఎల్లప్పుడూ ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు.‘భారత్ మాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్. జై హింద్’ అంటూ పవన్ కల్యాణ్ తన పోస్టులో పేర్కొన్నారు.స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జయంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. 18 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన త్యాగాన్ని కొనియాడారు.
18 ఏళ్లకే దేశం కోసం త్యాగం.. ఖుదీరామ్ బోస్‌కు పవన్ కల్యాణ్ నివాళి
7
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan