బ్యాంకు లాకర్‌లో భద్రపరిచిన బంగారు, వెండి ఆభరణాలు కనిపించకుండా పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది.కాన్పూర్‌కు చెందిన రష్మి అరోరా అనే మహిళ తన లాకర్‌లో సుమారు రూ.50 లక్షల విలువైన నగలను భద్రపరిచారు. అయితే సంవత్సరాల తర్వాత లాకర్ తెరిచి చూడగా అందులో నగలు లేకపోవడంతో ఆమె షాక్‌కు గురయ్యారు.కాన్పూర్ స్వరూప్‌నగర్‌కు చెందిన రష్మి అరోరా తన భర్తతో కలిసి 2003 ఫిబ్రవరి 26న అప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్‌లో ఖాతా ప్రారంభించారు.అదే సమయంలో బ్యాంకు అధికారులు వారికి లాకర్ నంబర్ 23 కేటాయించారు. అందులో బంగారు, వెండి ఆభరణాలను భద్రపరిచారు.తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైంది.భర్త మరణం తర్వాత రష్మి కుమార్తె వద్ద లఖ్‌నవూలో ఉంటున్నారు. బ్యాంకుకు రాకపోకలు తగ్గడంతో లాకర్ సురక్షితంగానే ఉంటుందని భావించారు.కొన్ని నెలల క్రితం బ్యాంకుకు వెళ్లగా తన పేరుతో లాకర్ లేదని సిబ్బంది చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయారు. అనంతరం పత్రాలు పరిశీలించగా లాకర్ అద్దె కోసం ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతున్నట్లు గుర్తించారు.జులై 27న లాకర్ తెరిచి చూడగా అందులో ఒక్క ఆభరణం కూడా కనిపించలేదు.
తన నగలు మాయమవడానికి బ్యాంకు యాజమాన్యం, సిబ్బంది కారణమై ఉండొచ్చని రష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు ఆధారంగా బ్రాంచ్ మేనేజర్‌తో పాటు సంబంధిత సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.లాకర్ రికార్డులు, పత్రాలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
బ్యాంకు లాకర్‌లో రూ.50 లక్షల నగలు మాయం.. కేసు నమోదు
9
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan