హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నష్టం నమోదైంది.రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 30 నుంచి ఆగస్టు 9 మధ్య కాలంలో ప్రకృతి విపత్తుల కారణంగా 157 మంది మృతిచెందారు. వీరిలో 68 మంది వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోగా, మరో 89 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు.భారీ వర్షాల కారణంగా దాదాపు 900 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు దెబ్బతిన్నాయి. దీంతో సుమారు రూ.886 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.ముఖ్యంగా కుల్లు, మండి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వరదల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి 161 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేయడం లేదు.కొండచరియలు విరిగిపడటం, భూమి కుంగిపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 259 రహదారులు దెబ్బతిన్నాయి.మండిలో 120 రోడ్లు మూసుకుపోగా, చంబాలో 42, కుల్లులో 40, సిమ్లాలో 30 రహదారులు ప్రభావితమయ్యాయి.అలాగే 54 తాగునీటి సరఫరా పథకాలు దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షాల తీవ్రత ఇంకా తగ్గలేదు. కాంగ్రా, మండి, హమీర్‌పూర్, సిమ్లా, సిర్మౌర్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.చంబా, కుల్లు, సోలన్, బిలాస్‌పూర్ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
హిమాచల్‌లో వర్ష బీభత్సం.. 157 మంది మృతి, రూ.886 కోట్ల నష్టం
6
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan