ప్రపంచవ్యాప్తంగా నాలుగు శతాబ్దాలకు పైగా ఉపయోగిస్తున్న మ్యాప్ రూపకల్పనలో కీలక మార్పు రానుంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న మర్కేటర్ ప్రొజెక్షన్ మ్యాప్‌కు బదులుగా ఈక్వల్ ఏరియా మ్యాప్ ప్రొజెక్షన్‌ను ప్రోత్సహించే తీర్మానానికి ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది.
మర్కేటర్ ప్రొజెక్షన్ మ్యాప్ దాదాపు 450 ఏళ్ల క్రితం నౌకాయాన అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది. అయితే ఈ విధానంలో ధ్రువ ప్రాంతాల సమీపంలోని భూభాగాలు వాస్తవ పరిమాణం కంటే పెద్దగా, భూమధ్యరేఖకు సమీపంలోని ఆఫ్రికా, దక్షిణాసియా, దక్షిణ అమెరికా వంటి ప్రాంతాలు చిన్నగా కనిపిస్తున్నాయి. ఈ అసమానతలను సరిచేయాలనే ఉద్దేశంతో ఈక్వల్ ఏరియా మ్యాప్ ప్రొజెక్షన్ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఈ తీర్మానానికి ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్‌లో 164 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. అమెరికా మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేసింది. ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
భారత్ కూడా ఈ మార్పుకు మద్దతు తెలిపింది. అయితే యూఎన్ తీర్మానానికి ఆమోదం తెలిపినంత మాత్రాన ఏ ఒక్క రాజకీయ మ్యాప్‌కు లేదా అంతర్జాతీయ సరిహద్దుకు ప్రత్యేకంగా మద్దతు ఇచ్చినట్లు భావించరాదని స్పష్టం చేసింది. కొత్త మ్యాప్‌లో భారత అధికారిక సరిహద్దులు, ముఖ్యంగా జమ్మూకశ్మీర్ అంశం, సరిగ్గా ప్రతిబింబించాలని భారత్ పేర్కొంది. ఎలాంటి పొరపాట్లను అంగీకరించబోమని తెలిపింది.
ఈ మార్పు భౌగోళిక వాస్తవాలను మరింత సమతుల్యంగా చూపించేందుకు ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
450 ఏళ్ల ప్రపంచ మ్యాప్‌కు మార్పులు.. యూఎన్ తీర్మానానికి భారత్ మద్దతు, కానీ కీలక వ్యాఖ్యలు
9
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati