అండర్-19 టీమిండియా క్రికెటర్ రోహిత్ యాదవ్‌కు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. వయసుకు సంబంధించిన తప్పుడు ఆధారాలు సమర్పించాడనే కారణంతో అతడిపై రెండేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని బీసీసీఐ ప్రకటించింది. అలాగే బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది.
ఇటీవల కాలంలో రోహిత్ యాదవ్ అండర్-19 జట్టు తరఫున మంచి ప్రదర్శన చేశాడు. శ్రీలంక పర్యటనలో యూత్ టెస్టుల్లో ఆరు వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దీంతో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న యూత్ వన్డే, టెస్టు సిరీస్‌లకు అతడికి చోటు దక్కింది. అయితే ఎంపికైన కొద్ది రోజులకే నిషేధం ఎదురైంది.
బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ విచారణలో రోహిత్ యాదవ్ పుట్టిన సంవత్సరానికి సంబంధించి వేర్వేరు పత్రాల్లో వేర్వేరు వివరాలు సమర్పించినట్లు గుర్తించింది. 2014లో బీసీఏకు ఇచ్చిన వివరాల్లో తాను 2007 జూలై 7న జన్మించినట్లు పేర్కొన్నాడు. ఆ తర్వాత ఆధార్ అప్‌డేట్ సమయంలో 2006లో జన్మించినట్లు తెలిపాడు. మళ్లీ 2020, 2021లో అప్‌డేట్ చేసుకున్నప్పుడు 2009లో జన్మించినట్లు వివరాలు ఇచ్చినట్లు బీసీఏ పేర్కొంది.
ఈ వ్యవహారంపై విచారణ జరిపిన బెంగాల్ అసోసియేషన్ మోసం జరిగినట్లు గుర్తించింది. వయసు మోసాలపై బీసీసీఐ కఠినంగా వ్యవహరిస్తూ గతంలోనూ కొంతమంది క్రికెటర్లపై చర్యలు తీసుకుంది. రోహిత్ యాదవ్ ఘటన బెంగాల్ క్రికెట్‌కు మచ్చగా మిగిలిందని అసోసియేషన్ పేర్కొంది.
Suspicious activity detected
ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక.. అంతలోనే షాక్! రోహిత్ యాదవ్‌పై రెండేళ్ల నిషేధం
12
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati