అమెరికాలో ఓ వ్యక్తి చావు అంచుల వరకు వెళ్లి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. డెంటిస్ట్ అపాయింట్‌మెంట్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో అతడిని అకస్మాత్తుగా పిడుగు తాకింది. ఈ షాకింగ్ ఘటన న్యూయార్క్ నగరంలోని స్టేటెన్ ఐలాండ్‌లో చోటుచేసుకుంది. థామస్ ఫహ్మీ అనే వ్యక్తి తుపాను సమయంలో తన వాహనం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దృశ్యాలు ఇంటి డోర్‌బెల్ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పిడుగు తాకిన వెంటనే ఫహ్మీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే కొద్దిసేపటికే అతడు లేచి తిరిగి ఇంట్లోకి వెళ్లిపోయాడు. పిడుగు ప్రభావం తర్వాత తన శరీరమంతా తీవ్రమైన అనుభూతికి గురైందని అతడు తెలిపాడు. శరీరమంతా తిమ్మిరి, మొద్దుబారడం, తీవ్రమైన నొప్పి, మంట వంటి లక్షణాలు కనిపించాయని చెప్పాడు. అయినప్పటికీ అతడు స్పృహ కోల్పోలేదు.
కుటుంబ సభ్యులు వెంటనే ఫహ్మీని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడికి పరీక్షలు నిర్వహించగా శరీరంపై ఎలాంటి కాలిన గాయాలు కనిపించలేదు. పిడుగు వంటి ప్రమాదకర ఘటన నుంచి ఎలాంటి పెద్ద గాయాలు లేకుండా బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చికిత్స అనంతరం మరుసటి రోజే అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చావు అంచుల వరకు వెళ్లి తిరిగొచ్చాడు.. పిడుగు తాకినా ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి
11
Published: 📅
Reported by: 🖊
Kanakadri