నాని క్రికెట్ ప్రిడిక్షన్ టెలిగ్రామ్ యాప్ నిర్వాహకుడు సుమంత్ కిడ్నాప్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతి రూరల్ పోలీసులు ఈ కేసును ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, సుమంత్ తన క్రికెట్ ప్రిడిక్షన్ టెలిగ్రామ్ యాప్‌ను నార్త్ ఇండియా వ్యక్తులకు రూ.6 కోట్లకు విక్రయించాడు. ఈ నగదు లావాదేవీలు హవాలా మార్గంలో జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ రూ.6 కోట్లపై సుమంత్ స్నేహితులు యశ్వంత్, మనోజ్, గౌతమ్, బాలాజీ, చరణ్, వాజిద్‌లు కన్నేశారని తెలిపారు.
దీంతో సుమంత్‌ను కిడ్నాప్ చేయాలని వారు పథకం రచించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇండోనేషియా నుంచి వచ్చిన సుమంత్‌ను బెంగళూరు సమీపంలో కిడ్నాప్ చేసి, అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అతడిని బంధించారు.
తనను కిడ్నాప్ చేశారంటూ సుమంత్ యూరప్‌లో ఉన్న తన గర్ల్‌ఫ్రెండ్‌కు వాట్సప్ మెసేజ్ పంపాడు. ఆమె కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి సుమంత్‌ను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు. ఈ కేసులో చంద్రగిరికి చెందిన బాలాజీ, చరణ్, వాజిద్‌లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న యశ్వంత్, మనోజ్, గౌతమ్‌ల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
రూ.6 కోట్ల కోసం స్నేహితులే కిడ్నాపర్లు.. నాని క్రికెట్ యాప్ నిర్వాహకుడికి విముక్తి
11
Published: 📅
Reported by: 🖊
Sarika Sk