స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్నికలు జరగడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. మున్సిపాలిటీల్లో రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ, వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. ఎన్నికలను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు లేరని, అందుకే ఏకగ్రీవ ఎన్నికలు జరగకుండా పార్టీ నేతలకు సూచనలు ఇచ్చారని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతోందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు, వెలిగొండ ప్రాజెక్టుల క్రెడిట్‌పై వైసీపీ నేతల వ్యాఖ్యలను కూడా ఆయన ప్రస్తావించారు.
అలాగే నెల్లూరులో కాల్వల కట్టలపై నివాసం ఉంటున్న వారికి శాశ్వత పట్టాలు ఇచ్చే అంశంపై త్వరలోనే శుభవార్త చెబుతామని మంత్రి నారాయణ తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని, స్థానిక ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఎన్ని అడ్డంకులు వచ్చినా స్థానిక ఎన్నికలు ఖాయం: మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
4
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk