రష్యా సైన్యంలో చేరిన భారతీయుల పరిస్థితిపై విదేశాంగ శాఖ కీలక వివరాలను వెల్లడించింది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న 51 మంది భారతీయులు మరణించినట్లు విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ తెలిపారు. ఈ అంశంపై రష్యాతో వివిధ స్థాయిల్లో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. మొత్తం 227 మంది భారతీయులు రష్యా సైన్యంలో చేరగా, ఇప్పటివరకు 139 మంది అక్కడి నుంచి బయటకు వచ్చారని వెల్లడించారు. మిగిలిన వారిని కూడా త్వరగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
మాస్కోలోని భారతీయ ఎంబసీ ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోందని విక్రమ్ మిశ్రీ పేర్కొన్నారు. భారతీయులు త్వరగా సైన్యం నుంచి డిశ్చార్జ్ అయ్యేలా రష్యా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
ఇదే సమయంలో భారత్-రష్యా వాణిజ్య సంబంధాలపై కూడా విదేశాంగ శాఖ సెక్రటరీ మాట్లాడారు. రష్యాలో జరిగే సమావేశాల్లో భారతీయ ఎగుమతిదారుల ఫోరం పాల్గొంటుందని తెలిపారు. భారత్ నుంచి దిగుమతులను పెంచేందుకు రష్యా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ పర్యటన సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ఈ వివరాలను వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమైన ప్రధాని మోదీ యుద్ధాలకు శాశ్వత ముగింపు పలకాల్సిన అవసరాన్ని ప్రస్తావించినట్లు సమాచారం.
రష్యా సైన్యంలో 51 మంది భారతీయుల మృతి.. కీలక వివరాలు వెల్లడించిన విదేశాంగ శాఖ
1
Published: 📅
Reported by: 🖊
Kanakadri