గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. మంగళవారం ఉదయం 9.15 గంటలకు గోవా ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన విమానంలో సమస్యను పైలట్లు గుర్తించారు. వెంటనే వారు ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారం అందించి, అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు.
అధికారుల అనుమతితో విమానాన్ని తిరిగి గోవా ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌పోర్టులో అధికారులు చర్యలు చేపట్టారు.
ఇండిగో విమానం 6E 2102 అత్యవసర ల్యాండింగ్ నేపథ్యంలో గోవా ఎయిర్‌పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రయాణికులను ఢిల్లీకి తరలించేందుకు ఇండిగో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం మరో విమానాన్ని సిద్ధం చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.
టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్లు గుర్తించినట్లు ఇండిగో వెల్లడించింది. ప్రస్తుతం విమానంలో ఏర్పడిన సమస్యను గుర్తించే పనిలో సాంకేతిక నిపుణులు ఉన్నారు. ప్రయాణికులు, విమాన సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ఇండిగో సంస్థ స్పష్టం చేసింది.
ఇండిగో విమానానికి తప్పిన పెను ముప్పు.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్
0
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati