తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎర్రవల్లి జాతీయ రహదారిపై టెన్త్ బెటాలియన్ సమీపంలో ఓ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే మార్గంలో వెళ్తున్న వాహనదారులు స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను హైదరాబాద్‌కు చెందిన సాయిరాం, మౌనికగా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి గద్వాల్ వైపు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి అతివేగం, డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రమాదం స్థానికంగా విషాదాన్ని నింపింది.
గద్వాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, ఇద్దరి మృతి
14
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati