విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడమే ఉపాధ్యాయులకు లభించే గొప్ప గుర్తింపు అని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. విశాఖపట్నంలోని ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జరిగిన జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు. ప్రస్తుతం 69,947 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 1,500 మంది విద్యార్థులు పెరిగారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతున్నదానికి ఇది నిదర్శనమని అన్నారు.
ఆరోగ్యం, విద్య రంగాలకు తన ఎంపీ లాడ్స్ నిధులను వినియోగించాలని నిర్ణయించుకున్నట్లు శ్రీభరత్ తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల అవసరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ కూడా పాల్గొన్నారు. ఉపాధ్యాయులు అందించే సేవలకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువేనని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరి విజయం వెనుక ఒక ఉపాధ్యాయుడి పాత్ర ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్నాయని, విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని చెప్పారు.
Suspicious activity detected
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే టీచర్లకు గొప్ప గౌరవం: ఎంపీ శ్రీభరత్
7
Published: 📅
Reported by: 🖊
Venkata Dodla