విదేశీ పర్యటనను సౌకర్యవంతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేయాలనుకునే వారికి భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. "మ్యాజికల్ మలేషియా విత్ సింగపూర్ సెన్సేషన్" పేరుతో 6 రాత్రులు–7 రోజుల ఈ టూర్ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి ప్రారంభం కానుంది.
ఈ పర్యటన 2026 ఆగస్టు 14న హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణంతో ప్రారంభమై, ఆగస్టు 21న సింగపూర్ నుంచి తిరిగి హైదరాబాద్‌కు చేరుకోవడంతో ముగుస్తుంది. ఈ ప్యాకేజీ ద్వారా మలేషియా, సింగపూర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది.
మలేషియాలో కౌలాలంపూర్, పెట్రోనాస్ ట్విన్ టవర్స్, పుత్రజయ, బటు కేవ్స్, జెంటింగ్ హైలాండ్స్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలు టూర్‌లో ఉన్నాయి. అలాగే సింగపూర్‌లో మెర్లియన్ పార్క్, సెంటోసా ఐలాండ్, యూనివర్సల్ స్టూడియోస్, గార్డెన్స్ బై ది బే, బర్డ్ ప్యారడైజ్, మేడమ్ టుస్సాడ్స్, వింగ్స్ ఆఫ్ టైమ్ షో వంటి ప్రముఖ ఆకర్షణలను సందర్శించేలా ప్రయాణ ప్రణాళిక రూపొందించారు.
ప్యాకేజీలో హైదరాబాద్–కౌలాలంపూర్, సింగపూర్–హైదరాబాద్ రిటర్న్ విమాన టికెట్లు, 3 స్టార్ హోటళ్లలో బస, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా, ట్రావెల్ ఇన్సూరెన్స్, స్థానిక గైడ్ సేవలు, ప్రధాన పర్యాటక ప్రాంతాల సందర్శన వంటి సేవలు ఉన్నాయి.
ప్యాకేజీ ధరలు సింగిల్ షేరింగ్‌కు రూ.1,91,000, డబుల్ షేరింగ్‌కు రూ.1,49,000, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.1,48,500గా నిర్ణయించారు. పిల్లలకు కూడా ప్రత్యేక ధరలు ఉన్నాయి.
వీసా, విమాన ప్రయాణం, హోటల్ బస, భోజనాలు, ప్రధాన పర్యాటక ప్రాంతాల సందర్శన వంటి అన్ని ఏర్పాట్లు ఒకే ప్యాకేజీలో ఉండటంతో విదేశీ పర్యటనను సులభంగా ప్లాన్ చేయాలనుకునే వారికి ఈ టూర్ ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది.
హైదరాబాద్ నుంచి మలేషియా-సింగపూర్‌కు IRCTC 7 రోజుల టూర్ ప్యాకేజీ
0
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan