ఇండోనేషియాను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఫ్లోరెస్ ప్రాంతంలో సోమవారం 5.9 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించినట్లు జర్మనీకి చెందిన GFZ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. భూకంప కేంద్రం భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఆగస్టు 15న ఇదే ప్రాంతంలో తీవ్ర భూకంపం సంభవించినట్లు కథనాలు వెల్లడించాయి. ఆ ఘటనలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో కేవలం రెండు రోజుల వ్యవధిలో మరోసారి భూమి కంపించడం స్థానికుల్లో ఆందోళన పెంచింది.
గత భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పాటు అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మంది తాత్కాలిక ఆశ్రయాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తూర్పు నుసా తెంగారా ప్రావిన్స్‌తో పాటు ఫ్లోరెస్, మంగరాయ్, తూర్పు మంగరాయ్, నాగేకియో ప్రాంతాల్లోనూ నష్టం నమోదైనట్లు సమాచారం.
భూకంపం అనంతరం అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇండోనేషియా పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఉండటంతో అక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వత కార్యకలాపాలు సంభవిస్తుంటాయి. తాజా ప్రకంపనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇండోనేషియాను మరోసారి కుదిపేసిన భూకంపం.. ఫ్లోరెస్‌లో 5.9 తీవ్రతతో ప్రకంపనలు
8
Published: 📅
Reported by: 🖊
Kanakadri