భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 మిషన్ విజయవంతం కావడం తొలి విజయమని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ఈ ప్రయోగం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో ఆరు ప్రయోగాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 రాకెట్ ప్రయోగం శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు షార్ అంతరిక్ష కేంద్రం నుంచి జరిగింది. ప్రయోగించిన రాకెట్ కేవలం 19 నిమిషాల్లోనే నిర్దేశిత కక్ష్యలోకి శాటిలైట్‌ను చేర్చింది. సుమారు 28,934 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి చేరింది.
ఈ ప్రయోగంలో భాగంగా పంపిన EOS-05 ఉపగ్రహం వాతావరణం, భూ పరిశీలనకు సంబంధించిన కీలక సమాచారాన్ని అందించనుంది. ఈ విజయంతో భారత సాంకేతిక సామర్థ్యం, శాస్త్రవేత్తల కృషి మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లైంది.
ఇక భారతదేశ ప్రతిష్ఠాత్మక మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’పై కూడా ఇస్రో దృష్టి సారించింది. గగన్‌యాన్‌కు సంబంధించిన తొలి ప్రయోగాన్ని త్వరలో నిర్వహించనున్నట్లు ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటించారు. ఈ విజయంతో షార్ కేంద్రంలోని ఉద్యోగులు, శాస్త్రవేత్తల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.
జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 విజయవంతమైన ప్రయోగం భవిష్యత్ అంతరిక్ష కార్యక్రమాలకు మరింత నమ్మకాన్ని ఇచ్చిందని ఇస్రో వర్గాలు భావిస్తున్నాయి.
గగన్‌యాన్‌కు తొలి అడుగు.. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 విజయంతో ఇస్రోలో ఉత్సాహం
13
Published: 📅
Reported by: 🖊
Kanakadri