టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి తన సత్తా చాటాడు. చాలాకాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్న భువీ, దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ వంటి వేదికల్లో తన ప్రతిభను నిరూపించుకుంటూ వస్తున్నాడు. తాజాగా యూపీ టీ20 లీగ్ 2026లో అతడి అద్భుత ప్రదర్శన సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది.
యూపీ టీ20 లీగ్‌లో లఖ్‌నవూ ఫాల్కన్స్ జట్టుకు భువనేశ్వర్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తొలి క్యాలిఫయర్‌లో లఖ్‌నవూ ఫాల్కన్స్, మీరట్ మావెరిక్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ జట్టు 19.4 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మీరట్ మావెరిక్స్‌ను భువీ తన బౌలింగ్‌తో కట్టడి చేశాడు.
భువనేశ్వర్ నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు. అతడి అద్భుత బౌలింగ్‌తో మావెరిక్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 98 పరుగులకే పరిమితమైంది. దీంతో లఖ్‌నవూ ఫాల్కన్స్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.
మావెరిక్స్ బ్యాటర్లలో రింకూ సింగ్, జీషన్ అన్సారీ పోరాడినా ఫలితం మారలేదు. ఈ ప్రదర్శనతో భువీ మరోసారి టీ20 జట్టులోకి పునరాగమనంపై ఆశలు పెంచుకున్నాడు. 2022 నవంబర్‌లో చివరిసారి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన అతడు, తాజా ఫామ్‌తో సెలక్టర్లకు ఆలోచన కలిగించాడు.
భువీ బౌలింగ్ తుఫాన్.. టీ20 పునరాగమనంపై సెలక్టర్లకు సంకేతం
19
Published: 📅
Reported by: 🖊
Banu Prakash