హైదరాబాద్‌లో గంజాయి కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. గంజాయి డాన్‌గా పేర్కొంటున్న నీతు భాయ్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టారు. గంజాయి విక్రయాల ద్వారా నీతు భాయ్ భారీగా డబ్బు సంపాదించినట్లు విచారణలో తేలిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఆదాయాన్ని హవాలా మార్గాల ద్వారా నిర్వహించినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం.
సోదాల సమయంలో అధికారులు పలు కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయి వ్యాపారం ద్వారా వచ్చిన అక్రమ ఆదాయం ఎక్కడికి తరలించబడింది, ఎవరెవరితో ఆర్థిక సంబంధాలు ఉన్నాయనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈడీ అధికారులు చేపట్టిన సోదాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సోదాలు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వాటి ద్వారా వచ్చే ఆర్థిక లావాదేవీలపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు.
గంజాయి డాన్ నీతు భాయ్‌పై ఈడీ దాడులు.. ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు
14