రైతులకు ఎరువుల కొనుగోలులో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త సెంట్రల్ ఫర్టిలైజర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ గురువారం నుంచి రైతులకు అందుబాటులోకి రానుంది. దీని ద్వారా రైతులు ఇంటి వద్ద నుంచే మొబైల్ ఫోన్ సహాయంతో ఎరువులను బుక్ చేసుకునే అవకాశం కలుగుతుంది.
ఈ యాప్‌లో యూరియాతో పాటు డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువులను కూడా కొనుగోలు చేయవచ్చు. ఎరువులు బుక్ చేసుకోవాలంటే రైతులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన ప్రతి రైతుకు ప్రత్యేక ఐడీ కేటాయిస్తారు. భవిష్యత్తులో రైతు భరోసా వంటి ఇతర రైతు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు కూడా ఈ ఐడీ అవసరం కావచ్చని అధికారులు తెలిపారు.
రైతులు ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ యాప్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్)ను డౌన్‌లోడ్ చేసుకుని ఎరువులను బుక్ చేసుకోవచ్చు. దీంతో గతంలో మాదిరిగా ఎరువుల కోసం గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సిన అవసరం ఉండదు. రైతులు తమ ఇంటి నుంచే అవసరమైన ఎరువులను బుక్ చేసుకోవచ్చు. సాగు భూమి విస్తీర్ణం ఆధారంగా ఎరువుల లభ్యతను పొందే అవకాశం ఉంటుంది.
ఈ యాప్ ద్వారా ఎరువుల వినియోగంలో శాస్త్రీయ విధానం అమలవుతుంది. అవసరానికి మించి ఎరువుల వాడకం తగ్గి నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఎరువుల డీలర్ల వద్ద ఉన్న స్టాక్ వివరాలు పారదర్శకంగా అందుబాటులో ఉంటాయి. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం అందించే ఎరువుల సబ్సిడీ దుర్వినియోగం కాకుండా ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది.
ఎరువుల కష్టాలకు చెక్.. రైతుల కోసం సెంట్రల్ ఫర్టిలైజర్ యాప్ ప్రారంభం
13
Published: 📅
Reported by: 🖊
Sarika Sk