కోల్‌కతాలో టీఎంసీ నేత, ఎంపీ అభిషేక్ బెనర్జీ కార్యాలయంపై జరిగిన దాడి రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. గురువారం తెల్లవారుజామున సుమారు 4.30 గంటల సమయంలో మాస్కులు, హెల్మెట్లు ధరించిన కొందరు వ్యక్తులు కార్యాలయంలోకి ప్రవేశించినట్లు సమాచారం. వారు అక్కడ నానా రభస సృష్టించి, వస్తువులను చెల్లాచెదురు చేసి, అద్దాలను పగలగొట్టినట్లు తెలుస్తోంది. కొన్ని వస్తువులను తమ వెంట తీసుకెళ్లినట్లు కూడా సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎంపీ అభిషేక్ బెనర్జీ స్వయంగా షేర్ చేశారు. దాడి వెనుక బీజేపీ ఉందని ఆయన ఆరోపించారు. పశ్చిమబెంగాల్ గవర్నర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై చర్యలు తీసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు.
అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలపై హింసాత్మక ఘటనలు, దాడులు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు టీఎంసీ ఐటీ సెల్ ఇన్‌చార్జ్ ఉపాసన చౌదరి కూడా స్పందించారు. బీజేపీతో సంబంధం ఉన్నవారే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
అభిషేక్ బెనర్జీ కార్యాలయంపై దాడి.. బీజేపీపై ఆరోపణలు చేసిన ఎంపీ
9
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk