ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. గురుగ్రామ్‌కు చెందిన వ్యక్తి రాత్రి సుమారు 10.30 గంటలకు యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేశాడు. కొంతసేపటి తర్వాత డెలివరీ ఏజెంట్ తన ఇంటి సమీపానికి వచ్చినట్టు యాప్‌లో లొకేషన్ కనిపించింది. అయితే ఫుడ్ మాత్రం అతనికి అందలేదు.దాదాపు 40 నిమిషాల పాటు ఎదురుచూసిన తర్వాత విసిగిపోయిన ఆ వ్యక్తి స్వయంగా డెలివరీ ఏజెంట్ వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. యాప్‌లో కనిపించిన లొకేషన్ ఆధారంగా అక్కడికి చేరుకున్న అతనికి ఆశ్చర్యకర దృశ్యం కనిపించింది. తాను ఆర్డర్ చేసిన ఫుడ్‌ను మరో ఇద్దరు వ్యక్తులు తింటున్నారని అతడు తెలిపాడు.తన ఆర్డర్‌ను డెలివరీ ఏజెంట్ ఇతరులకు విక్రయించినట్టు తెలుసుకున్నానని ఆరోపిస్తూ ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సంబంధిత ఫుడ్ డెలివరీ కంపెనీని ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు కూడా చేశాడు. “ఇది ఫుడ్ డెలివరీనా? ఫుడ్ షేరింగా?” అంటూ ప్రశ్నించాడు.ఈ పోస్టు వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ముఖ్యంగా రాత్రి వేళ ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేసే సమయంలో క్యాష్ ఆన్ డెలివరీ ఎంపికను ఉపయోగించడం మంచిదని కొందరు సూచించారు. ముందస్తు చెల్లింపులు చేయకపోవడం సురక్షితమని మరికొందరు అభిప్రాయపడ్డారు.
ఆర్డర్ చేసిన ఫుడ్ రాక వెళ్లి చూస్తే షాక్.. తన భోజనం మరొకరికి అమ్మేసిన డెలివరీ ఏజెంట్!
8
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan