మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై సాధించిన విజయంపై భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆనందం వ్యక్తం చేసింది. గ్రూప్ స్టేజ్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పాకిస్థాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో భారత జట్టు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన చేశారు. వారి ధాటికి పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలి కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయినా, 8.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది.
మ్యాచ్ అనంతరం హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. ప్రతి మ్యాచ్‌ను కీలకంగా తీసుకుని నిర్దాక్షిణ్యంగా ఆడాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతామని తెలిపింది. పాకిస్థాన్‌పై కూడా అదే వ్యూహాన్ని అమలు చేశామని, అందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. భారత బౌలర్లు పిచ్ పరిస్థితులను అర్థం చేసుకుని అద్భుతంగా బౌలింగ్ చేశారని ప్రశంసించింది.
సెమీ ఫైనల్ బెర్తు ఖరారైనప్పటికీ జట్టు ఎలాంటి అలసత్వం ప్రదర్శించలేదని హర్మన్ తెలిపింది. జట్టు ప్రమాణాలను ఎప్పుడూ అత్యున్నత స్థాయిలో కొనసాగించడం ముఖ్యమని పేర్కొంది. ఛేదనలో వరుసగా మూడు వికెట్లు కోల్పోవడం క్రికెట్‌లో సహజమేనని, పాకిస్థాన్‌కు మంచి బౌలింగ్ దళం ఉందని ఆమె అభిప్రాయపడింది.
పాక్‌పై ఘన విజయం.. నిర్దాక్షిణ్యంగా ఆడాం: హర్మన్‌ప్రీత్ కౌర్
16
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan