మహిళల ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఘోరంగా విఫలమైంది. భారత స్పిన్నర్ల అద్భుత బౌలింగ్ కారణంగా పాక్ బ్యాటింగ్ కుప్పకూలి కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత జట్టు 8.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అయితే ఈ పరాజయం తర్వాత కూడా పాకిస్థాన్ కోచ్ వహాబ్ రియాజ్ జట్టు సామర్థ్యంపై విశ్వాసం వ్యక్తం చేశాడు. తమ జట్టులోని ఆటగాళ్లందరికీ మంచి ప్రతిభ ఉందని, వారు తమపై తాము నమ్మకం ఉంచాలని సూచించాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో చేసిన తప్పులను సమీక్షించుకుని, అవి మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించాడు.
ఆసియా కప్ ట్రోఫీ గెలిచే అత్యుత్తమ జట్టు పాకిస్థాన్‌దేనని తాను ఇప్పటికీ నమ్ముతున్నానని రియాజ్ తెలిపాడు. టోర్నీ పరిస్థితులు తమ జట్టుకు అనుకూలంగా ఉన్నాయని, చివరకు ఆసియా కప్‌ను పాకిస్థాన్‌నే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
ఇక జట్టు కూర్పుపై వచ్చిన విమర్శలపై కూడా రియాజ్ స్పందించాడు. సనా మీర్ అభిప్రాయాలతో తనకు సంబంధం లేదని, భవిష్యత్ టోర్నీలను దృష్టిలో పెట్టుకుని కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చామని వివరించాడు. గతంలో ఆడిన ఆటగాళ్లు పలు ప్రపంచకప్‌లు, ఆసియా కప్‌లు ఆడినా ఆశించిన ఫలితాలు రాలేదని పేర్కొన్నాడు.
55 పరుగులకే ఆలౌట్ అయినా.. ఆసియా కప్ మాదే: పాక్ కోచ్ ధీమా
10
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati