మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విషాదకర ఘటన జరిగింది. వంట విషయంలో జరిగిన చిన్న గొడవ చివరకు ఓ మహిళ ప్రాణాలు తీసింది. భార్య వంట చేయడానికి నిరాకరించిందన్న కారణంతో భర్త ఆమెపై దాడి చేసి తీవ్రంగా కొట్టి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ్‌పూర్‌కు చెందిన 41 ఏళ్ల కృష్ణలాల్ యాదవ్, యామిని కృష్ణలాల్ యాదవ్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చిన కృష్ణలాల్ తన కోసం, పిల్లల కోసం వంట చేయాలని భార్యను కోరాడు. అయితే డ్యాన్స్ క్లాస్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న యామిని వంట చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది.
మద్యం మత్తులో ఉన్న కృష్ణలాల్ కోపంతో భార్యపై దాడి చేశాడు. ఆమె గొంతు, పొత్తికడుపుపై బలంగా కొట్టడంతో యామిని తీవ్రంగా గాయపడింది. నొప్పులు ఎక్కువగా ఉన్నాయని చెప్పడంతో మాత్రలు తీసుకురావడానికి భర్త బయటకు వెళ్లాడు. అయితే మెడికల్ షాప్ మూసి ఉండటంతో తిరిగి వచ్చాడు. కొంతసేపటి తర్వాత యామిని ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది.
కడుపులోని అవయవాలకు తీవ్ర గాయాలు కావడంతో యామినిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. తొలుత పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదికలో బలమైన గాయాల కారణంగా గొంతు ఎముక విరిగిందని, కడుపులోని పేగులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తేలింది. దీంతో పోలీసులు కేసును హత్య కేసుగా మార్చి కృష్ణలాల్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు.
వంట విషయంలో గొడవ.. భార్యను కొట్టి చంపిన భర్త అరెస్ట్
14
Published: 📅
Reported by: 🖊
Banu Prakash