టీమిండియాలోకి తిరిగి రావాలని ఆశిస్తున్న భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యకు మరోసారి నిరాశ ఎదురైంది. అఫ్గానిస్థాన్‌తో సెప్టెంబర్ 13 నుంచి జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. జట్టులో పలువురు ఆటగాళ్లు గాయాల సమస్యలను ఎదుర్కొంటుండటంతో కృనాల్‌కు అవకాశం లభిస్తుందని అభిమానులు భావించారు. ఐదేళ్ల తర్వాత అతడు భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడనే అంచనాలు కూడా వచ్చాయి. కానీ చివరకు ప్రకటించిన జట్టులో కృనాల్ పేరు లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు.
అయితే కృనాల్ మాత్రం తన ఆశలను వదులుకోలేదు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “ఆశ ఇంకా సజీవంగానే ఉంది” అనే భావంతో ఓ పోస్ట్ చేశాడు. దానికి ఫింగర్ క్రాస్ (HOPE) ఎమోజీతో పాటు భారత జెండా ఎమోజీని జత చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో చర్చకు దారితీసింది.
కృనాల్ పాండ్య చివరిసారిగా 2021లో భారత జట్టు తరఫున ఆడాడు. టీ20 ఫార్మాట్‌లో భారత్‌కు 19 మ్యాచ్‌లు ఆడిన అతడు 10 ఇన్నింగ్స్‌లలో 124 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 15 వికెట్లు సాధించాడు. ఆ తర్వాత జట్టుకు దూరమైనప్పటికీ, ఇటీవల ఐపీఎల్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జాతీయ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం కోసం కృనాల్ ఎదురుచూస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్ పరిస్థితిపై ఆధారపడి భవిష్యత్తులో కృనాల్ పేరును పరిశీలించే అవకాశం ఉందని సమాచారం.
అఫ్గాన్ సిరీస్‌కు నో ఛాన్స్.. ఆశ మాత్రం సజీవమే అంటున్న కృనాల్ పాండ్య
18
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati