అస్సాంలోని దిమా హసావో జిల్లాలో రెండు రోజులుగా ఆచూకీ లభించకుండా పోయిన అటవీశాఖ అధికారులు, సహాయక సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు గుర్తించారు. అధికారిక విధుల కోసం మారుమూల అటవీ ప్రాంతానికి వెళ్లిన బృందంతో సంబంధాలు తెగిపోవడంతో అధికారులు, కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఈ బృందంలో 23 మంది అటవీశాఖ అధికారులు, ముగ్గురు సహాయక సిబ్బంది సహా మొత్తం 26 మంది ఉన్నారు. వారందరినీ గాలింపు బృందాలు గుర్తించాయని అస్సాం అటవీశాఖ మంత్రి జయంత మల్ల బరువా అధికారికంగా ప్రకటించారు. సిబ్బంది ఎవరూ ప్రమాదంలో లేరని, అందరూ క్షేమంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.
దిమా హసావో, కర్బి ఆంగ్లాంగ్, నాగాలాండ్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో అటవీశాఖ సిబ్బంది తరచూ పెట్రోలింగ్, కూంబింగ్, సర్వే కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా సంబంధిత బృందం మారుమూల ప్రాంతంలో విధులు నిర్వహించేందుకు వెళ్లింది.
అయితే ఆ ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్, ఇతర కమ్యూనికేషన్ సదుపాయాలు సరిగా లేకపోవడంతో బృందంతో సంబంధాలు నిలిచిపోయాయి. గంటలు గడుస్తున్నా సమాచారం అందకపోవడంతో ఉన్నతాధికారులు ప్రత్యేక గాలింపు చర్యలను ప్రారంభించారు
అడవిలో సంబంధాలు తెగిన 26 మంది సిబ్బంది సురక్షితం
0
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan