ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2021 నుంచి 2025 మధ్య కాలంలో ప్రధాని విదేశీ పర్యటనల వ్యయం గణనీయంగా పెరిగినట్లు రాజ్యసభలో విదేశాంగ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు.
2021లో ప్రధాని విదేశీ పర్యటనల కోసం రూ.36 కోట్లు ఖర్చు కాగా, 2022లో ఈ మొత్తం రూ.55 కోట్లకు చేరింది. 2023లో రూ.93 కోట్లకు పెరిగిన వ్యయం.. 2024లో రూ.109 కోట్లుగా నమోదైంది.
2025లో ఇప్పటివరకు ఈ ఖర్చు రూ.180 కోట్ల మార్కును దాటినట్లు మంత్రి వెల్లడించారు. 2021 నుంచి ఇప్పటి వరకు ప్రధాని విదేశీ పర్యటనల కోసం రూ.550 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు తెలిపారు.
ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు రూ.74.58 కోట్లు ఖర్చు కాగా, జూన్‌లో జరిగిన ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించిన బిల్లుల లెక్కింపు ఇంకా పూర్తికాలేదని వివరించారు.
గత మే నెలలో ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని చేపట్టిన నార్వే పర్యటన అత్యధిక ఖర్చుతో నిలిచినట్లు మంత్రి తెలిపారు.
ఈ ఒక్క పర్యటన కోసం రూ.17.46 కోట్లు ఖర్చు అయినట్లు వెల్లడించారు.
విదేశీ పర్యటనలు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులు, వాణిజ్యం, వ్యూహాత్మక అంశాలపై చర్చలకు ఉపయోగపడతాయని ప్రభుత్వం చెబుతోంది.
ఈ ఏడాది ఇప్పటివరకు ప్రధాని విదేశీ పర్యటనలకు దాదాపు రూ.74.58 కోట్లు ఖర్చు అయినట్లు మంత్రి తెలిపారు.
అయితే జూన్‌లో జరిగిన ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించిన ఖర్చుల లెక్కింపు ఇంకా పూర్తికాలేదని వెల్లడించారు. బిల్లులు పూర్తిగా పరిశీలించిన తర్వాత తుది వ్యయం స్పష్టమయ్యే అవకాశం ఉంది.
ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చుల వివరాలు పారదర్శకతలో భాగంగా పార్లమెంట్‌లో వెల్లడించినట్లు కేంద్రం పేర్కొంది.
మోదీ విదేశీ పర్యటనల ఖర్చు ఐదేళ్లలో ఐదు రెట్లు పెరుగుదల
11
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan