నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల మధ్య మరో ఘటన చోటుచేసుకుంది. బల్గేరియా తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న గ్రీకు కంటైనర్ నౌక ‘కాంట్షిప్ జెట్’పై మూడు సముద్ర డ్రోన్లు దాడి చేసినట్లు కథనం పేర్కొంది. తీవ్రంగా దెబ్బతిన్న నౌక అనంతరం సముద్రంలో మునిగిపోయింది.
ఈ నౌక ఇజ్రాయెల్‌లోని హైఫా నుంచి రొమేనియాలోని కాన్స్టాంటా నౌకాశ్రయానికి వెళ్తోంది. నౌకలో మొత్తం 421 కంటైనర్లు ఉన్నట్లు సమాచారం. బల్గేరియా ప్రత్యేక ఆర్థిక మండలికి సుమారు 21 నాటికల్ మైళ్ల దూరంలో అక్టోబర్ 28న మూడు సముద్ర డ్రోన్లు నౌకను ఢీకొన్నట్లు అధికారులు తెలిపారు.
దాడి కారణంగా నౌక ఒకవైపునకు ఒరిగి తీవ్రంగా దెబ్బతింది. తర్వాత గురువారం తెల్లవారుజామున అది సముద్రంలో మునిగిపోయినట్లు బల్గేరియా ప్రభుత్వం వెల్లడించినట్లు కథనం తెలిపింది.
నౌకలో మొత్తం 18 మంది సిబ్బంది ఉండగా, వారందరినీ దాడి జరిగిన వెంటనే ఖాళీ చేయించారు. వారిలో 14 మంది ఫిలిప్పీన్స్‌కు చెందినవారు, మరో నలుగురు ఉక్రెయిన్ పౌరులని సమాచారం. బల్గేరియా నౌకాదళం, సరిహద్దు భద్రతా సిబ్బంది సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షితంగా రక్షించారు.
డ్రోన్ దాడి దృశ్యాలు కెమెరాల్లో రికార్డైనట్లు కథనం పేర్కొంది. నల్ల సముద్రంలో వాణిజ్య నౌకల భద్రతపై ఈ ఘటన మరోసారి ఆందోళన పెంచింది.
నల్ల సముద్రంలో డ్రోన్ దాడి.. గ్రీకు కంటైనర్ నౌక మునక, 18 మంది సిబ్బంది సురక్షితం
12
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk