తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు మరింతగా విస్తరించడంతో నవంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా కోవై, నీలగిరి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోందని, శుక్రవారం ఉదయం ఇది దక్షిణ అండమాన్, అండమాన్-నికోబార్ దీవుల సమీపంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వ్యవస్థ ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం వైపు ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది.
అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. రాబోయే 48 గంటల్లో ఇది ఆంధ్రప్రదేశ్ తీరంవైపు కదిలే అవకాశముందని పేర్కొన్నారు. ఈ ప్రభావంతో తమిళనాడులో శనివారం నుంచి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వివరించారు.
ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైన తర్వాత తమిళనాడులో సాధారణంతో పోలిస్తే 37 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా ఏర్పడిన అల్పపీడనం, అది వాయుగుండంగా బలపడే అవకాశం నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు
నవంబర్ 1 నుంచి తమిళనాడులో మళ్లీ వర్షాలు.. కోవై, నీలగిరికి భారీ వర్ష సూచన
16
Published: 📅
Reported by: 🖊
Kanakadri