చైనాలోని హుయాక్సీ గ్రామం సంపన్న జీవనశైలి, సామూహిక వ్యాపార నమూనాతో ప్రత్యేక గుర్తింపు పొందింది. విలాసవంతమైన ఇళ్లు, లగ్జరీ కార్లు, ఉచిత వైద్యసదుపాయాలు, కుటుంబాలకు అధిక ఆదాయం వంటి అంశాలతో ఈ గ్రామం ప్రసిద్ధి చెందిందని కథనం తెలిపింది.
1961లో స్థానిక కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి వూ రెన్‌బావో గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. వ్యవసాయాన్ని ఆధునీకరించిన తర్వాత ఉక్కు, రవాణా, సరుకు రవాణా, వస్త్ర పరిశ్రమల వైపు గ్రామ ఆర్థిక వ్యవస్థను విస్తరించారు. 1994లో గ్రామస్థుల భాగస్వామ్యంతో హుయాక్సీ గ్రూప్ కార్పొరేషన్ ఏర్పాటైంది. కెమికల్స్, టెక్స్టైల్స్, స్టీల్, అగ్రికల్చర్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, షిప్ బిల్డింగ్ వంటి అనేక రంగాల్లో సంస్థలు పనిచేస్తున్నట్లు కథనం పేర్కొంది.
ఈ కంపెనీల లాభాల్లో గ్రామస్థులకు వాటా లభిస్తుందని, జీతాలు, బోనస్‌లు, పెన్షన్లు కలిపి ఒక్కో కుటుంబానికి భారీ వార్షిక ఆదాయం ఉంటుందని వివరించింది. పని, పెట్టుబడి, పరిశ్రమల విస్తరణను గ్రామ అభివృద్ధి మోడల్లో కీలక అంశాలుగా పేర్కొన్నారు.
హుయాక్సీ గ్రామ ఏర్పాటుకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 328 మీటర్ల ఎత్తైన లాంగ్సి ఇంటర్నేషనల్ హోటల్ నిర్మించారు. 74 అంతస్తుల ఈ భవనంలో సూట్లు, రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్స్, రూఫ్‌టాప్ గార్డెన్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి. గ్రామ వైభవాన్ని చూసేందుకు ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారని కథనం తెలిపింది.
కోటీశ్వరుల గ్రామం హుయాక్సీ.. విల్లాలు, లగ్జరీ కార్లు, కోట్ల ఆదాయం
15
Published: 📅
Reported by: 🖊
Sarika Sk